![]() |
![]() |

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లోని కొందరు నటీనటుల ఆన్ స్క్రీన్ కి వారి పర్సనల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ లోని రుద్రాణి(షర్మిత).. అందులో కాస్త పద్దతిగా ఉన్న బయట పాప్ స్టార్ లా ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో గుప్పెడంత మనసు సీరియల్ లోని జగతి అలియాస్ జ్యోతిరాయ్ ఉంటుంది. ఆమె తన పర్సనల్ లైఫ్ లో పొట్టి పొట్టి డ్రెస్ లతో దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడమ్ అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది.
జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది.

తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రతీరోజు "గుప్పెడంత మనసు" సీరియల్ లో చీరకట్టులో ఒక అమ్మ పాత్రలో జగతిని చూసే ప్రేక్షకులకు, ఈ ఫోటోస్ నచ్చకపోవచ్చు. బోల్డ్ లుక్ లో నాభి అందాలని చూపిస్తుంది జ్యోతి రాయ్. టీజర్ ఈజ్ కమింగ్ సూన్ అంటు పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోని చూసిన నెటిజన్లు.. 'మిమ్మల్ని ఇంత ట్రేండీగా చూడాలని లేదు జగతి మేడం. అమ్మగా మాత్రమే చూడాలనుకుంటున్నాం' అని ఒకరు కామెంట్ చేయగా.. నేను చేసేది నటన మాత్రమే నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుందని రిప్లై ఇచ్చింది జగతి. ఇంకా కొన్ని నెగెటివ్ కామెంట్లు రావడంతో తన పోస్ట్ కి కామెంట్ చేసే ఆప్షన్ ని తిసేసింది జ్యోతిరాయ్. కాగా ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.
![]() |
![]() |